త్రిభుజాలు - రకాలు :
త్రిభుజాలను భుజాలు, కోణాల ఆధారముగా రెండు రకాలుగా విభజించారు.
1. భుజాల ఆధారముగా :
1. సమబాహు త్రిభుజము
2. సమద్విబాహు త్రిభుజము
3. విషమ బాహు త్రిభుజము
1. సమబాహు త్రిభుజము:
=>త్రిభుజంలోని 1 జత భుజాలు సమానం అయిన ఆ త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజము అంటారు.
=>ఈ త్రిభుజంలో 3 భుజాలు సమానము. అనగా AB = BC = AC అయితే ఆ త్రిభుజమును "సమబాహు త్రిభుజము" అంటారు.
(లేదా)
=> త్రిభుజంలో ∠A = ∠B = ∠C అయితే దానిని సమబాహు త్రిభుజము అంటారు.
=> ఈ త్రిభుజము లో ఒక్కో కోణం విలువ 60.
=> చుట్టుకొలత 3a.
2. సమద్విబాహు త్రిభుజము:
=> AB = AC, ∠B = ∠C, BC = భూమి
=> సమద్విబాహు త్రిభుజంలో అసమాన భుజాన్ని (BC) భూమి అంటారు.
=> ఈ త్రిభుజంలో భూకోణాలు సమానం.
=> భూమికి ఎదురుగా నుండే కోణాన్ని శీర్ష కోణం అంటారు.
=> చుట్టుకొలత 2a + b.
3. విషమబాహు త్రిభుజము :
=> ఏ రెండు భుజాల కొలతలు సమానంగా లేని త్రిభుజమును విషమబాహు త్రిభుజము అంటారు.
అనగా AB ≠ BC ≠ AC, ∠A ≠∠B ≠∠C
=>చుట్టుకొలత = a + b +c
కోణాల ఆధారముగా
1. అధికకోణ త్రిభుజము
2. అల్పకోణ త్రిభుజము
3. లంబకోణ త్రిభుజము
1. అధికకోణ త్రిభుజము:
=> త్రిభుజంలో ఒక కోణం అధిక కోణం అయిన ఆ త్రిభుజమును అధిక కోణ త్రిభుజము అంటారు.
=> ఇక్కడ ∠A >90, ∠B + ∠C < 90
=> అధిక కోణ త్రిభుజము లో ఏవేని 2 కోణాల మొత్తం 3 వ కోణం కంటే తక్కువ.
2. అల్పకోణ త్రిభుజము
=>త్రిభుజం లోని ప్రతీ కోణం అల్ప కోణం అయితే అది అల్పకోణ త్రిభుజం అవుతుంది.
=>∠A, ∠B, ∠C < 90º అయిన ఆ త్రిభుజం అల్ప కోణ త్రిభుజం.
=> ∠A + ∠B > ∠C అయిన ఆ త్రిభుజం అల్పకోణ త్రిభుజము.
=> ఒక త్రిభుజంలో (అల్పకోణ ) ఏవేని 2 కోణాల మొత్తం 3 వ కోణం కంటే ఎక్కువ.
=> సమబాహు త్రిభుజము అల్పకోణ త్రిభుజము అవుతుంది.
3. లంబకోణ త్రిభుజము:
=> త్రిభుజం లో ఒక కోణం లంబకోణం అయితే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటారు.
ఇక్కడ BC - కర్ణం, ∠A = ∠B + ∠C
=> లంబ కోణ త్రిభుజం లో లంబకోణానికి ఎదురుగా ఉండే భుజం కర్ణం.
=> ΔABC లో ∠A = ∠B + ∠C అయిన ఆ త్రిభుజం లంబకోణ త్రిభుజం.
=> ∠B = 90º అయితే ∠A + ∠C = 90º అవుతుంది.
=> లంబకోణ త్రిభుజం లో ఉండే అల్పకోణాల సంఖ్య 2.
No comments:
Post a Comment